అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer comitted suicide on wednesday | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Feb 18 2015 9:51 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

పులివెందుల :  అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన గంగాధర్(39) అనే రైతు ఏడు ఎకరాలలో పంటను సాగు చేశాడు. వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో అప్పులు పెరిగాయి.

దీంతో మనస్తాపం చెందిన రైతు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని కేసు నమోదు చేశారు. కాగా, మృతుడు గంగాధర్ కు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement