నకిలీ సూసైడ్ నోట్‌తో పోలీసులకు బురిడీ ? | fake suicide note to the police? | Sakshi
Sakshi News home page

నకిలీ సూసైడ్ నోట్‌తో పోలీసులకు బురిడీ ?

Jan 4 2015 2:15 AM | Updated on Sep 2 2017 7:10 PM

కేబుల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. తన వేధింపులు బయటకు పొక్కకుండా చూసే క్రమంలో నకిలీ సూసైడ్ నోట్‌

కాంట్రాక్టర్ ఆత్మహత్యలో  కొత్త కోణం
ఆరా తీస్తున్న నిఘా విభాగం

 
విజయవాడ సిటీ : కేబుల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. తన వేధింపులు బయటకు పొక్కకుండా చూసే క్రమంలో నకిలీ సూసైడ్ నోట్‌ను కాల్‌మనీ వ్యాపారి తన స్నేహితుల ద్వారా సృష్టించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఁకాటేసిన కాల్‌మనీ* శీర్షికతో ఁసాక్షి*లో శనివారం ప్రచురితమైన కథనం    చర్చనీయాంశంగా మారింది. గాంధీనగర్‌లోని జంట థియేటర్ల ప్రాంతానికి చెంది కాల్‌మనీ వ్యాపారి ఆగడాలకు కేబుల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సాక్షి కథనం ఆధారంగా పోలీసు నిఘా విభాగం ఈ ఘటనపై లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మృతుడు రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్ కూడా నకిలీదేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. సత్యనారాయణపురానికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ కేబుల్ కాంట్రాక్టర్ చంద్రశేఖర్ మూడు రోజుల కిందట తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రూ.2లక్షలు కాల్‌మనీగా తీసుకొని సకాలంలో చెల్లించలేకపోయాడు.

కాల్‌మనీ వ్యాపారి వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాల్‌మనీ వ్యాపారి రంగంలోకి దిగి తన పేరు బయటకు పొక్కకుండా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. తన స్నేహితులను పంపి మృతుని కుటుంబ సభ్యులను సున్నితంగా హెచ్చరించడంతో పాటు చంద్రశేఖర్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ ఓ లేఖను కూడా తయారు చేసి సంఘటనా స్థలంలో వదిలేసినట్టు చెపుతున్నారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తే అనేక విషయా లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.  

రంగంలోకి నిఘా విభాగం

కాంట్రాక్టరు ఆత్మహత్య ఘటనలో నిజాలను వెలికి తీసేందుకు పోలీసు నిఘా విభాగం రంగంలోకి దిగినట్టు విశ్వసనీయంగా తెలి సిం ది.  చంద్రశేఖర్ వివరాలను ఈ విభాగం సేకరించింది. గాంధీనగర్ కేంద్రంగా కాల్‌మనీ చేసే వ్యాపారికి సంబంధించిన వివరాలను రాబట్టే పనిలో పడ్డారు. చంద్రశేఖర్ ఆర్థిక పరిస్థితి, కాల్‌మనీ వ్యాపారికి ఇవ్వాల్సిన మొత్తం తదితర వివరాలతోపాటు వ్యాపారి ఆగడాల గురించి కూడా వీరు తెలుసుకుంటున్నారు. ఈ సమాచారం ఆధారంగా కాల్‌మనీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నట్టు తెలిసింది. సత్యనారాయణపురం పోలీసులు కొందరు సాక్షులను పిలిపించి చంద్రశేఖర్ ఆత్మహత్యపై విచారణ జరిపారు.  
 
 

Advertisement
Advertisement