పది రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నల్లజర్ల వైబీ ఆసుపత్రి నకిలీ డాక్టర్ జువ్వల రమేష్ శనివారం ఏలూరులో పోలీసులకు
నల్లజర్ల రూరల్ : పది రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నల్లజర్ల వైబీ ఆసుపత్రి నకిలీ డాక్టర్ జువ్వల రమేష్ శనివారం ఏలూరులో పోలీసులకు చిక్కినట్టు సమాచారం. శుక్రవారం సీహెచ్.పోతేపల్లిలో ప్రత్యక్షమై పోలీసులకు చిక్కినట్టే చిక్కి మాయమయ్యాడు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు చివరకు ఏలూరులో చిక్కినట్టు తెలుస్తోంది. ఎటువంటి వైద్యానుభవం లేకున్నా మెడికల్ రిప్రెజెంటివ్‌గా పనిచేసిన అనుభవంతో వైబీ హాస్పటల్, జీ.వి.సాగర్, ఎమ్మెస్ జనరల్ పేరుతో మూడేళ్లుగా రమేష్ అనే వ్యక్తి నల్లజర్లలో ఆసుపత్రి నడుపుచున్నాడు. ఆసుపత్రిలో పనిచేసే నర్సు మృతికి కారణమైన అతడిపై కేసు నమోదవడంతో నకిలీ డాక్టర్ గుట్టు రట్టైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీహెచ్ పోతేపల్లి నుంచి పరారైన అతడు ఏలూరు పోలీసులకు చిక్కాడని తెలిసింది.