ఉపాధి కూలీలకు నకిలీ నోట్లు పంపిణీ | Fake Currency Distribution In Srikakulam District | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలకు నకిలీ నోట్లు పంపిణీ

Jun 14 2018 8:36 AM | Updated on Jun 14 2018 11:35 AM

Fake Currency Distribution In Srikakulam District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బూర్జ : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ గ్రామంలో ఉపాధి జకూలీలకు పంపిణీ చేసిన నోట్లలో నకిలీ నోట్లు వెలుగుచూశాయి. వేతనదారులకు తోటవాడ పోస్టుమాస్టర్‌ తిరుపతిరావు బుధవారం వేతనాలు పంపిణీ చేశారు. వీటిలో సుమారు రూ.15 వేల మేరకు నకిలీ రూ.వంద నోట్లు ఉన్నట్లు కొంతమంది గుర్తించి సర్పంచ్‌ గేదెల ప్రసాద్‌కు చూపించారు. సర్పంచ్‌ పోస్టుమాస్టర్‌ని పిలిపించి ప్రశ్నించగా తోటవాడ హోమియో ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న అప్పారావు మంగళవారం రూ.3.50 లక్షలు డిపాజిట్‌ చేశారని.. ఆ నోట్లనే తాను కూలీలకు పంపిణీ చేశానని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, పోస్టుమాస్టర్‌ తిరుపతిరావు, అటెండర్‌ అప్పారావును బూర్జ పోలీసులు అదుపులోకి తీసుకొని సీఐ సమక్షంలో విచారిస్తున్నారు. నకిలీ నోట్ల వ్యవహారంలో మరో వ్యక్తి హస్తం ఉన్నట్లు అప్పారావు తెలియజేయటంతో సంబంధిత వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement