ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో బాహాబాహీ | exercise police station sucessfully | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో బాహాబాహీ

Sep 6 2013 4:42 AM | Updated on Oct 20 2018 6:17 PM

సూళ్లూరుపేట ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం మద్యం వ్యాపారి వేనాటి సురేష్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంకయ్య వర్గాలు బాహాబాహీకి దిగాయి. మద్యం షాపులు రెన్యువల్ అయ్యాక ఆర్థిక పరమైన లావాదేవీల వ్యవహారంలో సురేష్‌రెడ్డికి, ఈఎస్ అంకయ్యకు మధ్య భేదాభిప్రాయాలు నెలకున్నాయి.

సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : సూళ్లూరుపేట ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం మద్యం వ్యాపారి వేనాటి సురేష్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంకయ్య వర్గాలు బాహాబాహీకి దిగాయి. మద్యం షాపులు రెన్యువల్ అయ్యాక ఆర్థిక పరమైన లావాదేవీల వ్యవహారంలో సురేష్‌రెడ్డికి, ఈఎస్ అంకయ్యకు మధ్య భేదాభిప్రాయాలు నెలకున్నాయి. దీంతో ఈఎస్ అంకయ్య  మద్యంను ఎంఆర్‌పీ రేట్లకే అమ్మాలని ఆదేశించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఫోన్‌లోనే నువ్వెంత అంటే నువ్వెంత అని దూషించుకున్నారు.
 
 ఈ నేపథ్యంలో గురువారం ఈఎస్ అంకయ్య, ఏఎస్ కొమరేష్ స్థానిక ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అదే సమయంలో సురేష్‌రెడ్డి తన అనుచరులతో కార్యాలయానికి వెళ్లారు. దీంతో అక్కడ ఇద్దరు బాహాబాహీకి దిగారు. సురేష్‌రెడ్డి అనుచరులు కార్యాలయంపై దాడి చేయడంతో కిటికీ అద్దాలు పగిలాయి. గొడవ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక సీఐ ఎం రత్తయ్య, ఎస్సై అంకమరావు అక్కడికి చేరుకున్నా.. ఇరు వర్గాలు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో వారు వెళ్లిపోయారు. టీడీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి అక్కడికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ చర్చలు జరిపి వివాదాన్ని సర్దుబాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement