వెఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలోని అటవీ ప్రాంతంలో ఓ నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు.
మైదుకూరు : వెఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలోని అటవీ ప్రాంతంలో ఓ నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ముదిరెడ్డి పల్లె సుగాలతండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై ఎల్లయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా తయారీ దారులు పరారయ్యారు. అక్కడ నిల్వ ఉంచిన 2,000 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. ఖాళీ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు.