'చెన్నంపల్లి' తవ్వకాల్లో అధికారుల కొత్తపాట | Excavations Continues In Chennampalli Fort For Hidden Treasures | Sakshi
Sakshi News home page

'చెన్నంపల్లి' తవ్వకాల్లో అధికారుల కొత్తపాట

May 3 2018 11:46 AM | Updated on May 3 2018 12:53 PM

Excavations Continues In Chennampalli Fort For Hidden Treasures - Sakshi

చెన్నంపల్లి కోటలో తవ్వకాలు (ఫైల్‌ ఫొటో)

కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది.

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది. రెండున్నర నెలలుగా కోటలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. ఇన్ని రోజులుగా ఖనిజ సంపద కోసం వేటగాళ్లు, పూజారులు, క్షుద్ర మాంత్రికులు, జియాలజీ అధికారుల సూచనల మేరకు తవ్వకాలు చేస్తున్నారు. అయితే కొత్తగా శాసనాలు, తాళపత్రాల ఆధారంగా తవ్వకాలు చేస్తున్నామని అధికారుల కొత్తపాట పాడుతుండటం గమనార్హం.

కాగా, కోట పైభాగాన పలు ప్రాంతాలతో పాటు, కోట బురుజులను సైతం వదల్లేదు. సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమైన కొద్ది రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టిలాంటిది బయట పడింది. సోమవారం కోట పైభాగంతో పాటు, దిగువున ఉన్న పెద్ద గుండు కింద సైతం తవ్వకాల పనులు చేపట్టారు. స్వామీజీలు, మాంత్రికులు, అధికారులు ఇలా ఎవరుపడితే వారు చెప్పిన చోటల్లా తవ్వకాల చేస్తుండడంతో జనం విస్తుపోతున్నారు. తవ్వకాలకు నెల్లూరు వచ్చిన 12 మంది కూలీలు ఉదయం సాయంత్రం పనులు చేస్తున్నారు. ఏది ఏమైనా మరో వారం రోజుల పాటు తవ్వకాలు చేపట్టి ముగింపు పలకనున్నట్లు సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement