కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టిచాకిరీనా..? | Employee on Contract Is Government Servant | Sakshi
Sakshi News home page

మెడపైనే జీవో నెం.27 అనే కత్తి వేలాడ దీసింది

Apr 11 2018 7:12 AM | Updated on Mar 28 2019 5:23 PM

Employee on Contract Is  Government Servant - Sakshi

మాట్లాడుతున్న ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం నాయకుడు

కర్నూలు(హాస్పిటల్‌) : రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ,   వారి మెడపైనే జీవో నెం.27 అనే కత్తి వేలాడ దీసిందని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంసీ.నరసింహులు, ఎన్‌డీ. సంపత్‌కుమార్‌ అన్నారు.  వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

ఈ సందర్భంగా నరసింహులు, సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ జీవో నెం.27 కాంట్రాక్టు/ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పాలిట గొడ్డలి పెట్టుగా మారిందన్నారు.  వెంటనే ఆ జీవోను సవరించి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఒకే పనికి...ఒకే వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జేవీవీఆర్‌కే ప్రసాద్‌కు వారు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌. వెంకటేశ్వర్లు, కోశాధికారి సత్యనారాయణ, నాయకులు సాయిరామ్, బాలకృష్ణయ్య,  హరికృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement