విద్యుత్ మరమత్తుల కోసం స్తంభం మీదకు ఎక్కిన వ్యక్తి జారిపడి మరణించిన ఘటన తుగ్గలి మండలం కర్నూరు జిల్లాలో జరిగింది.
తుగ్గలి: విద్యుత్ మరమత్తుల కోసం స్తంభం మీదకు ఎక్కిన వ్యక్తి జారిపడి మరణించిన ఘటన తుగ్గలి మండలం కర్నూరు జిల్లాలో జరిగింది. ఉప్పరపల్లికి చెందిన పంపావతి(35) అనే యువకుడు గతంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసాడు. పాడైన స్తంభం మీద వైర్లు సరిచేసేందుకు ఎక్కిన అతను ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.