ఈసీ ఆగ్రహం.. సీఐపై బదిలీ వేటు

Election Commission Transfers Madanapalle Two Town CI - Sakshi

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా మదనపల్లి టూ టౌన్‌ సీఐ సురేశ్‌ కుమార్‌పై బదిలీ వేటు పడింది. టీడీపీ ప్రచార సభలో కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి రాజంపేట పార్లమెంట్‌ అబ్జార్వర్‌ నవీన్‌ కుమార్‌ చెప్పిన కూడా సురేశ్‌ కేసు నమోదు చేయలేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సురేశ్‌ తీరుపై నవీన్‌ ఆంధ్ర ప్రదేశ్‌ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ద్వివేదీ సురేశ్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. సురేశ్‌ స్థానంలో కొత్తవారిని నియమించేందుకు మూడు పేర్లను సూచించాలని డీఐజీని ద్వివేదీ ఆదేశించారు. ఆదివారం ఉదయం 11 గంటల్లోపు కొత్త సీఐని నియమిస్తామని ద్వివేదీ తెలిపారు.  

మరోపైపు టీడీపీకి ఓటేయమని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సెర్ప్‌ సీఈఓ కృష్ణమోహన్‌పై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. కృష్ణమోహన్‌పై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ద్వివేదీ ఏపీ ప్రభుత్వాని కోరారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోయినా, ప్రజలను ఇబ్బంది పెట్టిన చర్యలు తీసుకుంటామని ద్వివేదీ హెచ్చరించారు. ఎన్నికల సంఘం హెచ్చరికలతో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో ఆందోళన నెలకొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top