పెంచిన ప్రేమ.. | edupugallu villagers tribute to pet dog | Sakshi
Sakshi News home page

పెంచిన ప్రేమ..

Jan 14 2014 9:47 AM | Updated on Sep 2 2018 3:30 PM

పెంచిన ప్రేమ.. - Sakshi

పెంచిన ప్రేమ..

మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్న రోజులివి. అలాంటిది పెంపుకుక్క చనిపోయిందని ఓ కుటుంబం తల్లడిల్లిపోతోంది.

కంకిపాడు: మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్న రోజులివి. అలాంటిది పెంపుకుక్క చనిపోయిందని ఓ కుటుంబం తల్లడిల్లిపోతోంది. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన దేవినేని అనిల్‌కుమార్ కుటుంబసభ్యులు కిక్ పేరుతో పిలుచుకునే కుక్క (నాలుగేళ్లు)ను ఎంతో ప్రేమతో పెంచారు.

అది అనారోగ్యంతో నాలుగు రోజుల కిందట మృతిచెందింది. దాన్ని ఖననం చేసిన ఆ కుటుంబసభ్యులు సోమవారం ఐదోరోజు కర్మకాండలు నిర్వహించారు. అన్నదానం చేశారు. ‘భగవంతుని సన్నిధిలో..’ అంటూ కిక్ నేస్తమైన మరో శునకం స్నూఫీ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నట్లు బ్యానర్లు ఏర్పాటుచేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement