ఎక్సైజ్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు, రూ.5లక్షల ఫైన్‌

East Godavari District: Excise CI Reddy Trinath Rao suspended - Sakshi

సాక్షి, అనపర్తి: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి, మద్యం అమ్మకాలను కూడా నిషేధించింది. ఈ తరుణంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సి న ఎక్సైజ్‌ సీఐ కంచే చేను మేసిందన్న చందంగా మద్యం అక్రమ తరలింపునకు పాల్పడి, చివరకు సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. అంతేకాకుండా ఆయనపై రూ.5 లక్షల జరిమానా విధించారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్‌ సీఐ రెడ్డి త్రినాథ్‌ మద్యం అక్రమ తరలింపు వ్యవహారంపై మంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు వేయడమే కాకుండా, రూ.5 లక్షల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ఎక్సైజ్‌ సీఐ త్రినాథ్‌ అక్రమంగా మద్యం తరలించారని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వివరాలలోకి వెళితూ.. కుతుకులూరు మారుతీనగర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి సీల్‌ వేయాలంటూ రాయవరం ఎక్సైజ్‌ సీఐ రెడ్డి త్రినాథ్‌రావు ఆదివారం అక్కడికి వచ్చారు. సీఐ వాహనంతో పాటు, ఇంకా రిజిస్ట్రేషన్‌ కాని వాహనంలో మరికొందరు వచ్చారు. రూ.1.5 లక్షల మద్యం బాటిళ్లను ఆ వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. తమకు ఇబ్బంది అవు తుందని షాపు సూపర్‌వైజర్లు జె.శేఖర్, షేక్‌ మౌషీ చె ప్పినా తాను చూసుకుంటానంటూ సీఐ మద్యం బాటిళ్లను వాహనాల్లో వేశారు. స్థానికులు అడ్డుకోబోగా సీఐ సొంత వాహనాన్ని డ్రైవర్‌ అక్కడి నుంచి వేగంగా తరలించాడు. మద్యం సీసాలతో మరో వాహనాన్ని స్థానికులు అడ్డుకుని అనపర్తి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

కఠిన చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే  
విషయం తెలిసి, ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్య నారాయ ణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మద్యం అక్ర మ తరలింపుపై సీఐ త్రినాథ్‌ను నిలదీశారు. తనకు ఎ టువంటి సంబంధం లేదని, గ్రామంలో మద్యం తరలింపుపై సమాచారం రావడంతోనే తాను వచ్చానని, షాపు సూపర్‌వైజర్ల మాటల్లో వాస్తవం లేదని సీఐ చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా సీఐ త్రినాథ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ ప్రభుకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ప్రశ్నలకు బదులేది సీఐ సారూ? 
షాపునకు సీలు వేసేందుకు వస్తే సీఐ వాహనం వెంట మరో వాహనం ఎందుకు వచ్చింది? స్థానికులు ప్రశ్నిస్తే కారులో ఉన్న వారు ఎక్సైజ్‌ సీఐ సెల్‌కు ఎందుకు ఫోన్‌ చేశారు? సీఐ ఆదేశం లేకుండా మద్యం బాటిళ్లు కారులోకి ఎలా వెళ్లాయి? అక్రమంగా మద్యం దొరికితే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పంచనామా జరగకుండానే తన కార్యాలయానికి హడావుడిగా ఎందుకు తరలించారనే ప్రశ్నలకు సీఐ జవాబు చెప్పాల్సి ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

23-05-2020
May 23, 2020, 14:43 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్...
23-05-2020
May 23, 2020, 14:24 IST
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వైరస్‌ నియంత్రణపై సమీక్షలో...
23-05-2020
May 23, 2020, 14:23 IST
తమిళనాడులో నగరాల మధ్య విమాన సర్వీసులను ఈ నెలాఖరు వరకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
23-05-2020
May 23, 2020, 13:26 IST
సాక్షి, బెంగుళూరు: దేశవ్యాప్తంగా కరోన వైరస్‌ పంజా విసురుతోంది. కోవిడ్‌ బారినపడ్డ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యం కర్ణాటక...
23-05-2020
May 23, 2020, 12:40 IST
ముంబై :  దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మహారాష్ట్రలో వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. విధి నిర్వ‌హణ‌లో భాగంగా...
23-05-2020
May 23, 2020, 11:00 IST
బ్రెసీలియా : క‌రోనా..క‌రోనా ఇప్ప‌డు ప్ర‌పంచ‌మంతా వినిపిస్తున్న మాట‌. రోజురోజుకి లెక్క‌లు మారుతున్నాయి. కోవిడ్ కేసుల్లో అగ్ర‌రాజ్యం అమెరికా 16,32,629 కేసుల‌తో...
23-05-2020
May 23, 2020, 10:45 IST
ఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైలులో సొంతూళ్లకు వెళ్లాలని భావించిన వలసకూలీలకు ఢిల్లీలో...
23-05-2020
May 23, 2020, 10:42 IST
పశ్చిమగోదావరి, తణుకు/తణుకు అర్బన్‌: లాక్‌డౌన్‌ ప్రకటించి రెండు నెలల కాలంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు నిరంతర పర్యవేక్షణతో పోలీసులు పూర్తి...
23-05-2020
May 23, 2020, 10:13 IST
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం మరో ఆరుగురికి కరోనా  పాజిటివ్‌గా నిర్థారణ...
23-05-2020
May 23, 2020, 09:56 IST
బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్‌-19)‌ పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనా శుక్రవారం తొలిసారిగా తమ దేశంలో ఒక్క పాజిటివ్‌...
23-05-2020
May 23, 2020, 09:22 IST
ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. రోజుల గడుస్తున్న కొద్దీ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది తప్ప...
23-05-2020
May 23, 2020, 09:05 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 48మంది మృతి చెందగా, వీరిలో...
23-05-2020
May 23, 2020, 09:01 IST
బెంగుళూరు : క‌రోనా కార‌ణంగా మూత‌బ‌డ్డ ఆల‌యాలు తిరిగి తెరుచుకునే ప‌రిస్థితి ఇప్ప‌ట్లో క‌నిపించ‌డం లేదు. అయితే ఆల‌యాలు తెర‌వాల‌ని...
23-05-2020
May 23, 2020, 08:28 IST
‘కోవిడ్‌–19 సమాచారాన్ని తెలుసుకోండి’ అంటూ మీ సెల్‌ఫోన్లకు సందేశాల రూపంలో ఏవైనా లింకులు వస్తున్నాయా? వాటిని చదివే ప్రయత్నం చేసే...
23-05-2020
May 23, 2020, 08:17 IST
న్యూయార్క్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో హర్యానాలోని గుర్‌గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించిన...
23-05-2020
May 23, 2020, 08:09 IST
సాక్షి, రాజమహేంద్రవరం: కరోనా లక్షణాలున్నా భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు. పాజిటివ్‌ వచ్చినా ఆస్పత్రి ఐసోలేషన్‌లోనే ఉండాలనే...
23-05-2020
May 23, 2020, 07:54 IST
కంటికి కనిపించని కరోనా వైరస్‌ రక్త కణాల్లో అంతర్లీనంగా దాగి ఉంటుంది. ఈ వైరస్‌ మనిషిని అతలాకుతలం చేసే మహమ్మారిగా...
23-05-2020
May 23, 2020, 07:16 IST
మహారాష్ట్ర నుంచి వస్తున్న వారి రూపంలో రాష్ట్రంలో  కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రెడ్‌జోన్ల పరిధిలో లేని జిల్లాల మీద...
23-05-2020
May 23, 2020, 06:25 IST
కాలిఫోర్నియా: కరోనా వైరస్‌ ఎంతటి ప్రభావం చూపుతుందో తెలిపే చిత్రమిది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మైక్‌ షూల్జ్‌కు ఇటీవల కరోనా...
23-05-2020
May 23, 2020, 06:11 IST
కరోనా మీద ప్రస్తుతం ప్రపంచం పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో కరోనాను కట్టడి చేయడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top