విశాఖ, ఉత్తర భారత్లో భూ ప్రకంపనలు | Earthquake hits visakhapatnam, north India | Sakshi
Sakshi News home page

విశాఖ, ఉత్తర భారత్లో భూ ప్రకంపనలు

May 21 2014 10:17 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో బుధవారం రాత్రి పది గంటల ప్రాంతంలో భూమి కంపించింది.

హైదరాబాద్: విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో బుధవారం రాత్రి పది గంటల ప్రాంతంలో భూమి కంపించింది. విశాఖ నగరంలో పలు చోట్లు, శ్రీకాకుళం భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు 12 సెకన్ల పాటు భూమి కంపించింది.

బంగాళాఖాతం తీరప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. సముద్రతీర ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉత్తర భారతదేశంలో కూడా భూమి కంపించింది. ఢిల్లీ, భువనేశ్వర్, జంషెడ్పూర్లలో భూ ప్రకంపనలు వచ్చాయి. చెన్నై, కోల్కతాలోనూ భూమి స్వల్పంగా కంపించింది. రెక్టార్ స్కేలుపై భూకపం తీవ్రత 5.6గా నమోదైంది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని సమాచారం. కాగా ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా అన్న విషయం తెలియరాలేదు. బంగాళతీరం ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు భయపడుతున్నారు. కాగా సునామీ ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement