అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి గ్రామంలో డ్రిప్ పరికరాల చోరీకి పాల్పడుతున్న ఓ దొంగను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి గ్రామంలో డ్రిప్ పరికరాల చోరీకి పాల్పడుతున్న ఓ దొంగను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి కొన్ని డ్రిప్ పరికరాలు, 6,100 మీటర్ల పైపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.