రష్యా సాయంతో ఐదోతరం యుద్ధ విమానాలు | DRDO to made fifth generation fighter aircraft | Sakshi
Sakshi News home page

రష్యా సాయంతో ఐదోతరం యుద్ధ విమానాలు

Dec 24 2013 1:23 AM | Updated on Sep 2 2017 1:53 AM

రష్యా సహకారంతో ఐదోతరం యుద్ధ విమానాల తయారీకి డీఆర్‌డీవో రూపకల్పన చేస్తున్నట్టు భారత రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ వీకే సారస్వత్ తెలిపారు.

రక్షణ శాఖ సలహాదారు సారస్వత్ వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: రష్యా సహకారంతో ఐదోతరం యుద్ధ విమానాల తయారీకి డీఆర్‌డీవో రూపకల్పన చేస్తున్నట్టు భారత రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ వీకే సారస్వత్ తెలిపారు. భవిష్యత్తులో మానవ రహిత, సౌరశక్తితో నడిచే విమానాలు రానున్నాయని, రష్యా సహకారంతో వీటి రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక గీతం వర్సిటీ, హైదరాబాద్ ఏరోనాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ‘మోడ్రన్ ఏయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్’పై రెండు రోజులు నిర్వహించనున్న జాతీయ సదస్సును సారస్వత్ సోమవారం ప్రారంభించారు. వర్సిటీ డెరైక్టర్ డాక్టర్ సంజయ్, ఏరోనాటికల్ హెచ్‌ఆర్డీ డాక్టర్ స్వామినాయుడు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి విజయ్‌కుమార్, గీతం రెసిడెంట్ డెరైక్టర్ వర్మ ఇందులో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement