రాష్ట్రంలో పిచ్చెక్కిన కుటుంబం ఏదైనా ఉందా అంటే అది చంద్రబాబు కుటుంబమేనని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో పిచ్చెక్కిన కుటుంబం ఏదైనా ఉందా అంటే అది చంద్రబాబు కుటుంబమేనని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. సీమాంధ్ర టీడీపీ నేతలకు చేతనైతే చంద్రబాబుతో జై సమైక్యాంధ్ర అని అనిపించాలని ద్వారంపూడి సవాల్ చేశారు.
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విడుదలయ్యాక చంద్రబాబు గుండెదడతో ఐదు రోజుల వరకు తన ఇంటి గడప దాడి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. మంత్రి తోట నరసింహం, కేంద్రమంత్రి పల్లంరాజు పార్టీ కోసం కష్టపడితే పదవులు రాలేదని, వారసత్వంగా వచ్చాయని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఇప్పటికైనా వారు రాజీ నామా చేయాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు.