మనోళ్లు నోరు జారుతున్నారు.. జాగ్రత్త: చంద్రబాబు | do not slip tongue, chandra babu warns party leaders | Sakshi
Sakshi News home page

మనోళ్లు నోరు జారుతున్నారు.. జాగ్రత్త: చంద్రబాబు

May 2 2017 1:54 PM | Updated on Jul 28 2018 6:51 PM

మనోళ్లు నోరు జారుతున్నారు.. జాగ్రత్త: చంద్రబాబు - Sakshi

మనోళ్లు నోరు జారుతున్నారు.. జాగ్రత్త: చంద్రబాబు

పార్టీలో కొంతమంది నేతలు నోరు జారుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్టీలో కొంతమంది నేతలు నోరు జారుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అమరావతిలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నా, వాటిని ప్రజలకు వివరించి చెప్పడంలో నాయకులు విఫలం అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆదేశించారు. జన్మభూమి కమిటీల తీరు బాగోలేదనే భావన కూడా వ్యక్తం అవుతోందని, తాగునీటి విషయంలో కూడా ప్రజల్లో అసంతృప్తి ఉందని,  ఈ అసంతృప్తి ఇంకా పెరగకుండా జాగ్రత్త పడాలని నాయకులకు ఆయన సూచించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement