రాష్ట్ర విభజనను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ పోరుబాట సాగిస్తోందని పార్టీ జిల్లా కన్వీనర్
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ పోరుబాట సాగిస్తోందని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పా రు. సోమవారం ఇక్కడ నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. రాష్ట్ర విభజన నిర్ణయూనికి నిరసనగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 6, 7 తేదీల్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే రహదారుల దిగ్భంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని పార్టీ శ్రేణులకు, సమైక్యవాదులకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు ఎగసిపడుతున్నప్పటికీ ప్రజల మ నోభావాలను అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేయడం దుర్మార్గమన్నారు. ఇందుకు నిరసనగా 48 గంటలపాటు రహదారుల దిగ్బం ధం చేయడానికి వైసీపీ పూనుకుం దన్నారు. అన్నివర్గాల ప్రజలు, సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, ఎన్‌జీవోలు, ఇతర జేఏసీ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.