వికటించిన ‘ఐరన్ ఫోలిక్’ | Distorted 'Iron Folic' | Sakshi
Sakshi News home page

వికటించిన ‘ఐరన్ ఫోలిక్’

Dec 12 2013 4:16 AM | Updated on Sep 2 2017 1:29 AM

ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన ఐరన్‌ఫోలిక్ ద్రావణం వికటించి ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.

 - 8 మంది చిన్నారులకు అస్వస్థత - ఆస్పత్రికి  తరలింపు
 జంగంరెడ్డిపల్లి (అమ్రాబాద్), న్యూస్‌లైన్: ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన ఐరన్‌ఫోలిక్ ద్రావణం వికటించి ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఇమ్యునైజేషన్‌లో భాగంగా బుధవారం ఉదయం అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలోని 30 మంది చిన్నారులకు ఏఎన్‌ఎంలు ఐరన్ ఫోలిక్ ద్రావణమిచ్చారు.
 
 వీరిలో సాయంత్రం అంజలి, జానకి, పండు, కృష్ణవంశీ, రంజిత్, జశ్వం త్‌తో పాటు మరో ఇద్దరు చిన్నారులు వాంతులు చేసుకున్నారు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే అంగన్‌వాడీ కార్యకర్త పద్మారాణితో కలిసి వాహనంలో బాధితులను అమ్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చా రు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఏఎన్‌ఎం భాగ్యమ్మను వివరణ కోరగా వారికి పడకపోవడం వల్లే వాంతులు చేసుకున్నారని, ఎలాంటి అపాయం లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement