
సాక్షి, విశాఖపట్నం : దిఘా నుంచి విశాఖపట్టణం వెళుతున్న దిఘా ఎక్స్‌ప్రెస్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిలారు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగిపోయాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును ఆపివేశాడు. అయితే అప్పటికే ఇంజిన్ సహా మూడు బోగీలు విరిగిన పట్టాల పైనుంచి వెళ్లాయి. ఎట్టకేలకు రైలు ఆగటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో గంటపాటు రైలు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. అనంతరం రైలు కదిలింది.