విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్త జనం శుక్రవారం పోటెత్తారు.
ఇంద్రకీలాద్రి: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్త జనం పోటెత్తారు. శుక్రవారం కావటంతో ఇంద్రకీలాద్రికి పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అధికారులు సరైన వసతులు కల్పించడంలో విఫలం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు 40 వేల మంది దర్శించుకుని ఉంటారని అంచనా. ఆలయప్రాంగణంలో పలుచోట్ల స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది.