తిరుమలకు పోటెత్తిన భక్తులు | devotees rush at tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Jun 9 2017 9:49 AM | Updated on Aug 25 2018 7:11 PM

తిరుమలకు పోటెత్తిన భక్తులు - Sakshi

తిరుమలకు పోటెత్తిన భక్తులు

చిత్తూరు జిల్లా తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 31 కంపార్టుమెంట్లు నిండి వెలుపల కూడా స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

కాలిబాటన వచ్చిన భక్తులకు 12 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 73,797 మంది దర్శించుకున్నారు. కాగా, శ్రీవారి జ్యేష్టాభిషేకం శుక్రవారంతో ముగియనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement