అభివృద్ధికి నోచుకోని ‘పెన్నహోబిలం’ | Development of unreformed 'Penna Ahobilam' | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి నోచుకోని ‘పెన్నహోబిలం’

Aug 14 2014 3:45 AM | Updated on Jun 1 2018 8:39 PM

అభివృద్ధికి నోచుకోని ‘పెన్నహోబిలం’ - Sakshi

అభివృద్ధికి నోచుకోని ‘పెన్నహోబిలం’

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు.

రెగ్యులర్ ఈఓను నియమించని వైనం
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇందుకు ప్రధాన కారణం రెగ్యులర్ ఈఓ లేకపోవడమే. నాలుగేళ్లుగా ఆలయూనికి ఇన్‌చార్జ్ ఈఓలే బాధ్యతలు వహిస్తుండడంతో ఆలయు అభివృద్ధి కుంటుపడుతోంది. ఆలయ అభివృద్ధిపై ఇన్‌చార్జ్ ఈఓలు శ్రద్ధ చూపలేకపోయూరన్న వివుర్శలు ఉన్నారుు. 2010లో ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న కృష్ణయ్యు ఆయున స్థానంలో ఉరవకొండ గ్రూప్ టెంపుల్ ఈఓ ఆనంద్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈయన బదిలీతో కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సుధారాణిని డిప్యుటేషన్‌పై ఇక్కడికి వేశారు.

రెండేళ్ల అనంతరం అనంతపురం గ్రూప్ టెంపుల్ ఈఓ రమేష్‌కు మళ్లీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. నెల రోజులు తిరగకుండానే తిరిగి గతంలో పనిచేసిన సుధారాణికే బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పంపనూరు సుబ్రవుణ్యేశ్వర స్వామి ఆలయూనికి రెగ్యులర్ ఈఓగా ఉంటూ పెన్నహోబిళం ఈఓగా ఇన్‌చార్జ్‌గా కొనసాగతున్నారు. ఆలయూనికి యేడాదికి రూ.80లక్షలు ఆదాయుం వస్తుంది. 2 వేల ఎకరాల వూన్యం కూడ ఉంది. రెగ్యులర్ ఈఓ లేకపోవడంతోనే ఆలయుం అభివృద్ధికి నోచుకోవడం లేదన్న వివుర్శలు వున్నారుు. ఈ విషయంపై జిల్లా దేవాదాయు శాఖ అసిస్టెంట్ కమిషనర్  వుల్లికార్జునను వివరణ కోరగా రెగ్యులర్ ఈఓను నియుమించడం తవు పరిధిలోని లేదని కమిషనర్ పరిధిలో ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement