అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముంబైకి పశ్చిమనైరుతి దిశగా 1135 కిలోమీటర్ల దూరంలో ఆ వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది. కర్ణాటక నుంచి దక్షిణ కోస్తా వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. దీంతో కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. అలాగే దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి కనిష్ట ఉష్టోగ్రతలు తగ్గి చలి పెరిగే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం పేర్కొంది.