ఢిల్లీలో సీమాంధ్రుల సత్తా చాటుతామని బీసీ ఐక్య కార్యాచరణ ఛైర్మన్ సీఆర్‌ఐ సుబ్బారెడ్డి హెచ్చరించారు. నగరంలో బుధవారం
ఢిల్లీలో సత్తా చాటుతాం
Oct 3 2013 5:13 AM | Updated on Sep 1 2017 11:17 PM
కడపసిటీ, న్యూస్‌లైన్: ఢిల్లీలో సీమాంధ్రుల సత్తా చాటుతామని బీసీ ఐక్య కార్యాచరణ ఛైర్మన్ సీఆర్‌ఐ సుబ్బారెడ్డి హెచ్చరించారు. నగరంలో బుధవారం ఏపీ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ద్వారా బయలుదేరింది. ఈ సందర్భంగా సీఆర్‌ఐ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని ఈనెల 4న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం సీమాంధ్ర జిల్లాల్లోని సుమారు 500 మంది ఢిల్లీకి పయనమైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని కులవృత్తుల వారితో ధర్నా చేపడతామన్నారు. బీసీ రిజర్వేషన్లను 25శాతం తగ్గించే ప్రక్రియను అడ్డుకుంటామన్నారు. ఢిల్లీకి కమిటీ నాయకులు వివి శ్యామ్‌ప్రసాద్, ఓబులేసు, పవన్, సుధాకర్, రామ్మోహన్, మునెయ్య, సమద్ బయలుదేరారు.
Advertisement
Advertisement