కొడాలి కుమార్తెలకు జగన్ ఆశీస్సులు | Daughters Kodali's blessings | Sakshi
Sakshi News home page

కొడాలి కుమార్తెలకు జగన్ ఆశీస్సులు

Jun 14 2014 1:48 AM | Updated on Jul 25 2018 4:09 PM

కొడాలి కుమార్తెలకు జగన్ ఆశీస్సులు - Sakshi

కొడాలి కుమార్తెలకు జగన్ ఆశీస్సులు

శుక్రవారం జరిగిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కుమార్తెల నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల శాసనసభ్యులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.

గుడివాడ : శుక్రవారం జరిగిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కుమార్తెల నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల శాసనసభ్యులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. కొడాలి నాని కుమార్తె విజయదుర్గకు కొడాలి నాని సోదరుడు చిన్న కుమార్తె శ్రీఅఖిలాండేశ్వరిదేవికి ఆయన ఆశీస్సులందజేశారు.  

జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ ప్రముఖులు హాజరయ్యారు. గుడివాడకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలు జగన్‌ను కలిసి కరచాలనం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా,పేర్ని నాని, కైకలూరు నియోజక వర్గ పార్టీ కన్వీనర్ దూలం నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు తెనాలి పార్లమెంటు మాజీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, గుడివాడ మున్సిపల్   చైర్మన్  యలవర్తి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు దుక్కిపాటిశశిభూషణ్, పాలేటి చంటి, నందివాడ మండల పార్టీ కన్వీనర్ పెయ్యల ఆదాం, గుడివాడ పట్టణ పార్టీ మహిళా విభాగం కన్వీనర్ కాటాబత్తుల రత్నకుమారి, మున్సిపల్ కౌన్సిలర్లు అడపా బాబ్జీ, మేరుగు మరియకుమారి, గొర్ల శ్రీనివాసరావు, నెరుసు చింతయ్య, పొట్లూరి కృష్ణారావు వెంపల హైమావతితోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement