డైలమాలో అన్నదాత | Dailamalo Annadata | Sakshi
Sakshi News home page

డైలమాలో అన్నదాత

Nov 21 2013 1:10 AM | Updated on Sep 2 2017 12:48 AM

ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు దెబ్బతినడంతో రబీలో సా గునీటిని విడుదలచేస్తే దాళ్వా పంట సాగు చేసుకుంటామని రైతులు కోరుతున్నారు.

మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు దెబ్బతినడంతో  రబీలో సా గునీటిని విడుదలచేస్తే దాళ్వా పంట సాగు చేసుకుంటామని రైతులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని వారు మంగళవారం మచిలీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి సారథిని అడిగారు.  నూటికి నూరుశాతం సాగునీరు విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తానని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రే  స్వయంగా ప్రకటిస్తారని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ ఏడాది ఇంతవరకు నీటిపారుదల సమీక్షా మండలి సమావేశం కూడా  నిర్వహించలేదు. రబీకి నీటి విడుదల విషయంపై నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నిం చగా, ఆ జిల్లా నుంచి ఇంకా ప్రతిపాదనే రాలేదని, ప్రాజెక్టుల నీరు ఉందని చెప్పినట్లు ప్రచారం జరగడం  జిల్లా నేతల పనితీరుకు అద్దం పడుతోంది. తిరుపతిలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు మంత్రి సారథి తదితరులు వెళ్లి సాగునీరు విడుదల చేయాలని కోరినా బుధవారం రాత్రి 9.30 గంటల వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు  మానసిక సంఘర్షణకు లోనవుతుంటే పాల కులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement