నల్లగొండ జిల్లాలో రోడ్డుపై కరెన్సీ నోట్ల కట్టల వర్షం! | Currency Notes Threw up on Road while travelling in Car | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లాలో రోడ్డుపై కరెన్సీ నోట్ల కట్టల వర్షం!

Aug 28 2013 4:00 PM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లాలో రోడ్డుపై కరెన్సీ నోట్ల కట్టల వర్షం! - Sakshi

నల్లగొండ జిల్లాలో రోడ్డుపై కరెన్సీ నోట్ల కట్టల వర్షం!

సమయం మధ్యాహ్నం కావస్తోంది. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారులో నుంచి రోడ్డుపైకి కరెన్సీ నోట్ల కట్టలు విసిరేస్తూ వెళ్లాడు ఓ వ్యక్తి.

  • డబ్బులు విసిరేస్తూ కారులో వెళ్లిన వ్యక్తి  నల్లగొండ జిల్లాలో ఘటన
  • దామరచర్ల: సమయం మధ్యాహ్నం కావస్తోంది. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారులో నుంచి రోడ్డుపైకి కరెన్సీ నోట్ల కట్టలు విసిరేస్తూ వెళ్లాడు ఓ వ్యక్తి. అప్పుడే అటుగా టీవీఎస్‌పై వెళ్తున్న వ్యక్తికి కొన్ని నోట్ల కట్టలు దొరకగా సమీప గ్రామస్తులకు కొన్ని నోట్లు లభించాయి. అవన్నీ కూడా రూ.500, రూ.1000 నోట్లే. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామ సమీపంలో అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
     
    గ్రామస్తులు తెలిపినవివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారులోనుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు (నోట్ల కట్టలు) విసిరేశాడు. అదే సమయంలో రోడ్డు మీద టీవీఎస్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి భారీగా కట్టలను తీసికెళ్లినట్లు తెలిసింది. కొండ్రపోల్ గ్రామస్తులకు కొన్ని రూ.500, 1000 నోట్లు దొరికాయి. దొరికిన వారు కొందరు పరారీలో ఉన్నారని సమాచారం.
     
    విషయం తెలిసిన వాడపల్లి ఎస్‌ఐ జి.మన్మథ కుమార్ సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఓ వ్యక్తి నుంచి రూ.500, రూ.1000 నోట్లు తీసుకుని మిర్యాలగూడ బ్యాంకులో పరీక్షించగా అసలువేనని తేలింది. టీవీఎస్‌పై వెళ్లిన వ్యక్తి ఆచూకీ కోసం, డబ్బులు వెదజల్లుతూ వెళ్లిన కారు కోసం దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement