అనంతపురం జిల్లా హిందూపురం, లేపాక్షి ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్, మట్కా నిర్వహిస్తున్న 15 మందిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు.
హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురం, లేపాక్షి ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్, మట్కా నిర్వహిస్తున్న 15 మందిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు హిందూపురం, పరిసర ప్రాంతాలలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ ఆడుతున్న ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,23,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే లేపాక్షి ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్న 8 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.80వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు.