బాబుపై కేసు నమోదు చేయకుంటే ... | cpm supports to lorry strike, says P Madhu | Sakshi
Sakshi News home page

బాబుపై కేసు నమోదు చేయకుంటే ...

Jun 14 2015 1:30 PM | Updated on Aug 13 2018 8:10 PM

బాబుపై కేసు నమోదు చేయకుంటే ... - Sakshi

బాబుపై కేసు నమోదు చేయకుంటే ...

జూన్ 23 నుంచి ప్రారంభం కానున్న లారీల సమ్మెకు తమ మద్దతు ఉంటుందని సీపీఎం నాయకుడు పి.మధు ప్రకటించారు.

విశాఖపట్నం: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్రం, టీఆర్ఎస్ ప్రభుత్వాలు... టీడీపీతో లాలూచీ పడ్డాయని ప్రజలు భావించ వలసి ఉంటుందని ఆయన తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో మధు మాట్లాడుతూ... శ్రీకాకుళం జిల్లా పొలాకిలో పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఒప్పంద పత్రాలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు.

అంతేకాకుండా పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం 1500 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రయత్నాలు మొదలైనాయని ఆయన విమర్శించారు. జూన్ 23 నుంచి ప్రారంభం కానున్న లారీల సమ్మెకు సీపీఎం మద్దతు ఉంటుందని పి.మధు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement