పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించండి

CPI,CPM Leaders Protest In Kurnool - Sakshi

మంత్రాలయం రూరల్‌ : పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గించాలని కోరుతూ మంత్రాలమం మండల కేంద్రంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్‌యాదవ్, సీపీఎం మండల నాయకులు జయరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు దాదాపు 18 సార్లు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచడం జరిగిందని మండిపడ్డారు. అంతే కాకుండా వంట గ్యాస్‌ ధరలు కూడాపెరగడంతో సామాన్యులు ఇళ్లల్లో వంట చేసుకోలేని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ధరలు తగ్గించపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో నాయకులు అనిల్, నూరమ్మ, భీమన్న, అనిల్, నర్సయ్య, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

కౌతాళం : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రల్, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి ఈరన్న అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలకు నిరసనగా శనివారం మండల కేంద్రమైన కౌతాళంలో రస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బిస్మిల్లా సర్కిల్‌లో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఈరన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారం చేపట్టిన వెంటనే ఇంధన ధరలపై నియంత్రణ చేపడుతామని హామీ ఇచ్చిందని, తీరా అధికారం చేపట్టాక లెక్కలేనన్ని సార్లు ధరలు పెంచిందని విమర్శించారు. దేశంలో ఇందన ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తే లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.40కు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు అక్రం, నాగరాజు, వలీ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top