మిత్రుడి కోసం ఆవుల మూగ వేదన

Cows Make Tribute To Their Friend Is So Sad Incident In Asifabad - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌ :  తమ ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనుషులే కాదు. మూగ జంతువులు సైతం బాధతో విలపిస్తాయి. బుధవారం కుమురం భీం జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో ఓ ఆవు అనారోగ్య కారణంతో మృతి చెందింది. మరణించిన ఆవును గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్‌ వెనక వైపు తాడుతో కట్టి పట్టణ శివారువైపు తీసుకెళ్తుండగా తోటి పశువులు చూసి తమ ఆత్మీయురాలిని కోల్పోతున్నామనే బాధతో ఆ ట్రాక్టర్‌ను అరుస్తు వెంబడించసాగాయి. సబ్‌ జైలు సమీపం నుంచి ఆదిలాబాద్‌ చౌరస్తా వరకు ఆ ట్రాక్టర్‌ వెనకలే దాదాపు రెండు కిలోమీటర్ల మేర పరిగెడుతూ తమ మూగ బాధను వెల్లబుచ్చాయి.   


మృతి చెందిన ఆవును బాధతో వెంబడిస్తున్న తోటి ఆవులు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top