జీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి 18న కౌంట్‌డౌన్ | Sakshi
Sakshi News home page

జీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి 18న కౌంట్‌డౌన్

Published Fri, Aug 16 2013 2:12 AM

Countdown for launching GSLV-D5 to commence on August 18

సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: షార్ కేంద్రం నుంచి ఈనెల 19న సాయంత్రం 4.50 గంటలకు జరగనున్న జీఎస్‌ఎల్‌వీ-డీ5 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియను 18వ తేదీ 11.50 గంటలకు ప్రారంభించనున్నట్లు షార్ డెరైక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్ చెప్పారు.18.30 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేసేలా డిజైన్ చేశామన్నారు. శుక్రవారం ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించి లాంచ్ రిహార్సల్ పూర్తి చేస్తామన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల షార్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రయోగం ద్వారా 1985 కిలోల బరువున్న జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
 
 ఇస్రో విశిష్ట పురస్కారం: షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌కు ఇస్రో విశిష్ట పురస్కారం లభించింది. ఇస్రోలో పనిచేస్తున్న వారిలో మూడో విశిష్ట వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ డెరైక్టర్ కె. కిరణ్‌కుమార్ విశిష్ట వ్యక్తులుగా గుర్తింపు సాధించారు. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌కు మూడో విశిష్టవ్యక్తిగా పురస్కారం లభించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement