కరోనా: సింహపురి రెడ్‌జోన్‌ 

Coronavirus: Simhapuri Belong To Red Zone Area At Nellore District - Sakshi

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపు 

జిల్లాలో 15 రెడ్‌జోన్‌ మండలాలు 

32 మండలాలు గ్రీన్‌జోన్‌   

మద్యం విక్రయాలకు అనుమతి 

కంటైన్‌మెంట్‌ జోన్లకు మినహాయింపు  

కృష్ణపట్నంపోర్టు, విద్యుత్, ఆయిల్, నిత్యావసరాల పరిశ్రమలకు అనుమతి  

సాక్షి, నెల్లూరు(పొగతోట): నెల్లూరు జిల్లాను కేంద్ర ప్రభుత్వం జిల్లాలను యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్‌గా పరిగణించింది. అయితే రాష్ట్ర స్థాయిలో భౌగోళికంగా, జనాభా పరంగా జిల్లాల విస్తీర్ణం అత్యధికం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మండలాలను యూనిట్‌గా తీసుకుని కరోనా పాజిటివ్‌ కేసుల లెక్కల ప్రకారం గ్రీన్, రెడ్‌జోన్‌ మండలాలను విభజించింది. లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపునకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సడలించిన ఆంక్షలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయి. మద్యం విక్రయాలకు కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా మిగతా ప్రాంతాల్లో విక్రయించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. 

  • రెడ్‌జోన్, కంటైన్‌మెంట్‌ జోన్లల్లో నిబంధనలు కఠినతరం చేయనున్నారు.  
  • కృష్ణపట్నంపోర్టు, విద్యుత్, ఆయిల్, నిత్యావసర సరుకుల పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది.  
  • గ్రీన్, ఆరెంజ్‌ జోన్లల్లో నిత్యావసర సరుకుల షాపులు, మందుల షాపులు, అత్యవసర సేవలకు అనుమతి ఉంది. విద్యా సంస్థలు, సినిమా హాల్స్, షాపింగ్‌ మాల్స్‌ తదితర వాటికి మాత్రం అనుమతి లేదు.  
  • గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు,. నాన్‌ ఎసెన్షియల్‌ వస్తువుల డెలివరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.    
  • అత్యవసర సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్, జూట్‌ మిల్లులు, ఐటీ హార్డ్‌వేర్‌ తదితర వాటికి అనుమతి ఇచ్చింది. పరిశ్రమల్లో పని చేసే కార్మికులందరూ మాస్క్‌లు ధరించి సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది.   
  • గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు స్థానికంగా ఉండే కూలీలతో చేయించుకోవాల్సి ఉంది. ప్రైవేట్‌ కార్యాలయాలు 33 శాతం మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.  
  • వైద్య సేవలు, ఐటీ సేవలు, ఇంటర్‌ స్టేట్స్, ఇంటర్‌ డిస్ట్రిక్‌ గూడ్సు సేవలు, నిత్యావసర వస్తువుల రవాణా, బ్యాంకింగ్, కొరియర్, పోస్టల్, అంగన్‌వాడీ కేంద్రాలు, అత్యవసర సర్వీసులకు అనుమతి ఉంది.  
  • రెడ్‌జోన్లలో నాన్‌ ఎసెన్షియల్‌ వస్తువుల విక్రయాలు, ఈ–కామర్స్‌ సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. 

 15 రెడ్‌జోన్‌ మండలాలు  
నెల్లూరు సిటీ, నెల్లూరురూరల్, నాయుడుపేట, వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లి, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు, కావలి, ఓజిలి, తోటపల్లిగూడూరు, కోవూరు మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నాయి. మిగిలిన 32 మండలాలు గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top