కరోనా పాజిటివ్.. బిడ్డకు జన్మనిచ్చిన ‌మహిళ

Coronavirus Positive Woman She Gives Birth To A Child In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నెలలు నిండిన గర్భిణి ఏలూరు ఆశ్రం కోవిడ్‌-19 ఆస్పత్రిలో మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. పలు జాగ్రత్తలతో డాక్టర్లు చేసిన సిజేరియన్‌ ఆపరేషన్‌ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుకు మొట్టమొదటి సిజేరియన్‌ అని డాక్టర్లు తెలిపారు. తల్లి బిడ్డ ఆరోగ్యం ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలోని పేదపాడు మండలం తోటగూడెంకు చెందిన మహిళ అని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. (బాసుంది వికటించి)

తల్లికి కరోనా పాజిటీవ్ కావడంతో బిడ్డ నమూనాలను కరోనా పరీక్షలకు ప‌ంపామని రిపోర్టు రావల్సి ఉందని వైద్యులు చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్రంలోనే మొట్ట మొదటి శస్త్రచికిత్స కాన్పుగా పేర్కొన్నారు. ‘కొద్ది రోజుల క్రితం డెలివరీ కోసం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన పెదపాడుకు మండాలనికి చెందిన ఓ గర్భిణీ మహిళకు ముందు జాగ్రత్త చర్యగా కరోనా పరీక్షలు నిర్వహించాము. ఆమెకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తూ మంగళవారం సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించాము. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది‌. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు’  అని ఆశ్రం కోవిడ్ -19 ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్‌ ఏఈఆర్‌ మోహన్  తెలిపారు. (ఏపీలో మరో 48 కరోనా కేసులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top