ఏపీలో కొత్తగా 1,322 కరోనా కేసులు | Coronavirus: 1322 New Positive Cases Registered In Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 1,322 కరోనా కేసులు

Jul 6 2020 4:18 PM | Updated on Jul 6 2020 6:53 PM

Coronavirus: 1322 New Positive Cases Registered In Andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 1,263 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. (చదవండి : పాజిటివ్‌ ఉన్నా లక్షణాల్లేవా!)

ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,712 మందికి  కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1,322 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,019కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 424 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 239కి చేరింది. ఈ రోజు మృతి చెందిన ఏడుగురిలో శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,860 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement