రోడ్డేసి..రంగు పూస్తే అభివృద్ధా..!

Construct Road And Put Color, There Are Development - Sakshi

సాక్షి, పాలకొల్లు అర్బన్‌:  రోడ్డేసి.. రంగు పూసి అభివృద్ధి అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మళ్లీ మీరే రావాలని ఫ్లెక్సీలు పెట్టుకుని ప్రచారార్భాటం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కన్వీనర్‌ గుణ్ణం నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు పంచాయతీ పరిధిలోని పార్వతీ నగర్‌లో మంగళవారం ఆయన రావాలి జగన్, కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.

అవినీతికి తార్కాణంగా పాలకొల్లు నియోజకవర్గాన్ని పేర్కొనవచ్చన్నారు. మళ్లీ ఆయనే వస్తే మరో రెండు మొక్కలు నాటి రంగులేస్తారేమోనన్నారు. మంచి జరిగితే ఆయనకు, చెడు జరిగితే వైఎస్సార్‌ సీపీకి ఎమ్మెల్యే నిమ్మల అంటగడుతున్నారన్నారు. పాలకొల్లు నియోజకవర్గం అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. 175 నియోజకవర్గాల్లో అవినీతిలో మొదటి స్థానంలో నిలబెట్టారే తప్ప ఏవిధంగా అభివృద్ధి చేయలేదన్నారు.

ప్రజాధనాన్ని ఎమ్మెల్యే దుర్వినియోగం చేశారన్నారు.  పగటి వేషగాడిలా వేషాలు మార్చి భాషను కలుషితం చేస్తుంటే ప్రజలు నవ్వి పోతున్నారన్నారు. చంద్రబాబునాయుడు అనేక వాగ్దానాలు ఇచ్చి  ఏ ఒక్క హామీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించాలనే లక్ష్యంతో నవరత్నాల పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

నాగబాబు వెంట మునిసిపల్‌ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, పార్టీ మండల కన్వీనర్‌ విప్పర్తి ప్రభాకరరావు, మాజీ సర్పంచ్‌ పెదపాటి హవీలా, ఎంపీటీసీ పొనుకుమట్ల వీరాస్వామి, ఉచ్చుల స్టాలిన్,  గ్రామ కమిటీ నాయకులు అల్లు శ్రీనివాస్, రావాడ సతీష్, కాటంరెడ్డి రామారావు, పోలాపు వెంకన్న, మిడతాని సీతామహాలక్ష్మి, కవురు రాంపండు, జిల్లా ప్రధాన కార్యదర్శి బోనం బులివెంకన్న, పార్టీ నాయకులు దేవ దుర్గాప్రసాద్, బొందా మోహన్‌రావు,  మద్దా చంద్రకళ, కర్నాటి విజయలక్ష్మి, షేక్‌ చాంద్‌బీబీ, మజ్జి పెద్దింట్లు, పైలా రాజశ్రీ, గుణ్ణం సుభాష్, ఖండవల్లి వాసు, గురుజు ముత్యాలరావు, సోడదాసి చిట్టిబాబు, వాకపల్లి పెద్దిరాజు, పిడకా మురళి, కేశవరపు సత్యనారాయణ, పార్శి వెంకటరత్నం, బండి రమేష్, మోర్త గిరీష్, పెన్మెత్స రంగరాజు, నిచ్చెనకోళ్ల బాలగంగాధర్‌ తిలక్, బొబ్బిలి శ్రీను, రావి నాగేశ్వరరావు, నడపన కృష్ణమూర్తి పాల్గొన్నారు.   
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top