breaking news
nimma Rama Naidu
-
రాయలసీమకు మరణశాసనం రాసింది చంద్రబాబే: శ్రీకాంత్ రెడ్డి
సాక్షి తాడేపల్లి: ప్రాజెక్టుల విషయంలో క్యూసెక్కులు, టీఎంసీలకు మధ్య కనీస తేడా సైతం తెలియని వ్యక్తి మంత్రి నిమ్మల రామనాయుడని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి రాయలసీమ ఎత్తిపోతల పథకం విలువ ఏలా తెలుస్తుందని ప్రశ్నించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ లిప్టుతో ఎన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయన్న విషయం మంత్రికి ఏం తెలుసని ప్రశ్నించారు.రాయలసీమను ఎడారిగా మార్చబోతే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ తెచ్చి ఊపిరి పోశారన్నారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోతిరెడ్డిపాడును అడ్డుకునేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ప్రభుత్వానికి రాయలసీమ మీద ఎందుకంత కోపమో తెలియదన్నారు. చంద్రబాబే రాయలసీమకు మరణ శాసనం రాశారని తెలిపారు.1995లో ఆల్మట్టి డ్యాం నిర్మాణాన్ని ఆపలేదు. అప్పటినుంచే చంద్రబాబు రాయలసీమ విషయంలో కుట్రలు జరుపుతున్నారని తెలిపారు.ఇప్పుడు రాయలసీమ లిఫ్టుపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అక్కడి ప్రజలు సహించరన్నారు. ఆల్మట్టి నుండి జూరాలకు నీరు వచ్చేసరికే వాటిని పక్క రాష్ట్రాలు దోచేస్తున్నాయి. శ్రీశైలంలో 800 అడుగులకు నీరు రాకముందే తెలంగాణకు జలాలు వెళుతున్నాయి. ఇక వీటన్నిటిని దాటి ఇక రాయలసీమకు నీరు ఏప్పుడు వస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం డేడ్ స్టోరేజీ వాటర్ కూడా ఉండడం లేదు. చంద్రబాబు నిర్లక్ష్యం వలనే రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు.బ్రహ్మం సాగర్, గండికోట ప్రాజెక్టులను మాజీ సీఎం జగన్ పూర్తి చేశారని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమకు చేసిందేంటని ప్రశ్నించారు. మంత్రి నిమ్మలతో చంద్రబాబు మాట్లాడించిన మాటలను వెంటనే వెనక్కు తీసుకోవాలని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంవత్సరంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రజల ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకోవాలని తెలిపారు. -
రోడ్డేసి..రంగు పూస్తే అభివృద్ధా..!
సాక్షి, పాలకొల్లు అర్బన్: రోడ్డేసి.. రంగు పూసి అభివృద్ధి అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మళ్లీ మీరే రావాలని ఫ్లెక్సీలు పెట్టుకుని ప్రచారార్భాటం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కన్వీనర్ గుణ్ణం నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు పంచాయతీ పరిధిలోని పార్వతీ నగర్లో మంగళవారం ఆయన రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. అవినీతికి తార్కాణంగా పాలకొల్లు నియోజకవర్గాన్ని పేర్కొనవచ్చన్నారు. మళ్లీ ఆయనే వస్తే మరో రెండు మొక్కలు నాటి రంగులేస్తారేమోనన్నారు. మంచి జరిగితే ఆయనకు, చెడు జరిగితే వైఎస్సార్ సీపీకి ఎమ్మెల్యే నిమ్మల అంటగడుతున్నారన్నారు. పాలకొల్లు నియోజకవర్గం అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. 175 నియోజకవర్గాల్లో అవినీతిలో మొదటి స్థానంలో నిలబెట్టారే తప్ప ఏవిధంగా అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజాధనాన్ని ఎమ్మెల్యే దుర్వినియోగం చేశారన్నారు. పగటి వేషగాడిలా వేషాలు మార్చి భాషను కలుషితం చేస్తుంటే ప్రజలు నవ్వి పోతున్నారన్నారు. చంద్రబాబునాయుడు అనేక వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క హామీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించాలనే లక్ష్యంతో నవరత్నాల పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నాగబాబు వెంట మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, పార్టీ మండల కన్వీనర్ విప్పర్తి ప్రభాకరరావు, మాజీ సర్పంచ్ పెదపాటి హవీలా, ఎంపీటీసీ పొనుకుమట్ల వీరాస్వామి, ఉచ్చుల స్టాలిన్, గ్రామ కమిటీ నాయకులు అల్లు శ్రీనివాస్, రావాడ సతీష్, కాటంరెడ్డి రామారావు, పోలాపు వెంకన్న, మిడతాని సీతామహాలక్ష్మి, కవురు రాంపండు, జిల్లా ప్రధాన కార్యదర్శి బోనం బులివెంకన్న, పార్టీ నాయకులు దేవ దుర్గాప్రసాద్, బొందా మోహన్రావు, మద్దా చంద్రకళ, కర్నాటి విజయలక్ష్మి, షేక్ చాంద్బీబీ, మజ్జి పెద్దింట్లు, పైలా రాజశ్రీ, గుణ్ణం సుభాష్, ఖండవల్లి వాసు, గురుజు ముత్యాలరావు, సోడదాసి చిట్టిబాబు, వాకపల్లి పెద్దిరాజు, పిడకా మురళి, కేశవరపు సత్యనారాయణ, పార్శి వెంకటరత్నం, బండి రమేష్, మోర్త గిరీష్, పెన్మెత్స రంగరాజు, నిచ్చెనకోళ్ల బాలగంగాధర్ తిలక్, బొబ్బిలి శ్రీను, రావి నాగేశ్వరరావు, నడపన కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
కాపులు ఐక్యంగా ఉండాలి
పాలకొల్లు : కాపు కులస్తులంతా ఐక్యమత్యంతో అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మలకాయల చినరాజప్ప ఉద్భోదించారు. ఆదివారం స్ధానిక ముచ్చర్లవారితోటలో నిర్వహించిన కాపు,తెలగ, బలిజ వనసమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. పాలకొల్లులో కల్యాణమండపం నిర్మాణానికి గుణ్ణం నాగబాబు కుటుంబం స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం ఇంకా అనేకమంది విరాళాలు ప్రకటించడం అభినందనీయమన్నారు. కాపు సంఘం నియోజకవర్గ కన్వీనర్ వంగా నర్సింహరావు అధ్యక్షతన జరిగిన సభలో చినరాజప్పను స్ధానిక ఎమ్మెల్యేలు డాక్టర్ నిమ్మల రామానాయుడు, పులపర్తి రామాంజనేయులు, మునిసిపల్ చైర్మన్ వల్లవు నారాయణమూర్తి, ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి(బాబ్జి), కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు, గుణ్ణం నాగబాబు, పడాల పుల్లయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, మెహందీ, మహిళల ఆటల పోటీలు అలరించాయి.


