
కాపులు ఐక్యంగా ఉండాలి
కాపు కులస్తులంతా ఐక్యమత్యంతో అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మలకాయల చినరాజప్ప ఉద్భోదించారు.
పాలకొల్లు : కాపు కులస్తులంతా ఐక్యమత్యంతో అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మలకాయల చినరాజప్ప ఉద్భోదించారు. ఆదివారం స్ధానిక ముచ్చర్లవారితోటలో నిర్వహించిన కాపు,తెలగ, బలిజ వనసమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. పాలకొల్లులో కల్యాణమండపం నిర్మాణానికి గుణ్ణం నాగబాబు కుటుంబం స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం ఇంకా అనేకమంది విరాళాలు ప్రకటించడం అభినందనీయమన్నారు. కాపు సంఘం నియోజకవర్గ కన్వీనర్ వంగా నర్సింహరావు అధ్యక్షతన జరిగిన సభలో చినరాజప్పను స్ధానిక ఎమ్మెల్యేలు డాక్టర్ నిమ్మల రామానాయుడు, పులపర్తి రామాంజనేయులు, మునిసిపల్ చైర్మన్ వల్లవు నారాయణమూర్తి, ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి(బాబ్జి), కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు, గుణ్ణం నాగబాబు, పడాల పుల్లయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, మెహందీ, మహిళల ఆటల పోటీలు అలరించాయి.