పాదయాత్రను అడ్డుకుంటే పోరాటమే: కాంగ్రెస్‌ | congress leaders slams chandrababu over mudragada padayatra | Sakshi
Sakshi News home page

పాదయాత్రను అడ్డుకుంటే పోరాటమే: కాంగ్రెస్‌

Jul 20 2017 2:32 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపులను మరోసారి మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపులను మరోసారి మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు, నగర అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారని విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని మాట తప్పారని అన్నారు. ముద్రగడ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేయాలని చంద్రబాబు చూస్తున్నారని, చంద్రబాబు అడగకుండానే కాపులకు మోసపూరిత హామీలు ఇచ్చారని తెలిపారు.
 
ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటే పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామన్నారు. ప్రపంచంలో చంద్రబాబు అంత చెండాల ముఖ్యమంత్రి ఎక్కడ ఉండరని తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు కాపులు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఆయనది చేతల ప్రభుత్వం కాదు.. కోతల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఏపీని పోలీస్ రాజ్యంగా మార్చుకున్నారని, ముద్రగడ పాదయాత్రకు చంద్రబాబు అనుమతి అక్కరలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement