'మీకు పోలవరంపై మాట్లాడే హక్కు లేదు' | congress has no right to talk for polovaram porject, says murali mohan | Sakshi
Sakshi News home page

'మీకు పోలవరంపై మాట్లాడే హక్కు లేదు'

Jun 7 2015 5:19 PM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని టీడీపీ ఎంపీ మురళీ మోహన్ మండిపడ్డారు.

హైదరాబాద్:పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని టీడీపీ ఎంపీ మురళీ మోహన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించి అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. రాజ్యసభలో ప్రకటన చేసి డ్రాఫ్ట్ లో చేర్చకపోవడం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదన్నారు.

 

గత యూపీఏ ప్రభుత్వం డ్రాఫ్ట్ లో చేర్చి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని మురళీ మోహన్ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే హక్కును కాంగ్రెస్ కోల్పోయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement