జాతీయ పార్టీలకు డిపాజిట్ల గల్లంతు

Congress And BJP Lost Their Deposits In Srikakulam - Sakshi

కాంగ్రెస్, బీజేపీలకు తప్పని ఘోర పరాభవం

10 నియోజకవర్గాల్లోను నోటా కంటే తక్కువ ఓట్లు నమోదు

సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ పార్టీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లాలో జాతీయ కాంగ్రెస్‌తోపాటు బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజ యాలను ఎదుర్కొన్నారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులు దాదా పుగా అన్ని నియోజకవర్గాల్లోను డిపాజిట్ల(ధరావతును)ను కోల్పోయారు. విశేషం ఏంటంటే ఈ రెండు పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులకు నోటాకు నమోదైన ఓట్లు కూడా సాధించకపోవడం విశేషం. చాలా చోట్ల నోటాలో కనీసం మూడోవంతు ఓట్లను కూడా దక్కించుకోలేకపోయారు. కేంద్రంలో బీజేపీ పూర్తి హవా కనబర్చినప్పటికీ రాష్ట్రంలో, శ్రీకాకుళం జిల్లాలో ఘోర పరాభవం ఎదురైంది.

జిల్లాలో  జాతీయ పార్టీలు సాధించిన ఓట్ల వివరాలు..

నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి   పోలైన ఓట్లు బీజేపీ అభ్యర్థి పోలైన ఓట్లు
పలాస  మజ్జి శారద 1731 కొర్రాయి బాలకృష్ణ 1337
ఇచ్ఛాపురం  కొల్లి ఈశ్వరరావు 2044 జెఎస్‌ ప్రసాదరావు 1651
నరసన్నపేట డోల ఉదయ్‌భాస్కరరావు 5235 రెడ్డి భాగ్యలక్ష్మి 758
ఆమదాలవలస బొడ్డేపల్లి సత్యవతి 961 పాతిన గడ్డెయ్య 850
పాతపట్నం రాము 1206 ఎస్‌.రాఘవరావు 1011
ఎచ్చెర్ల కె.సింహాద్రినాయుడు 2113  ఆర్‌. సూర్యప్రకాశరావు 984
టెక్కలి చింతాడ దిలీప్‌కుమార్‌  1948 హెచ్‌ ఉదయ్‌భాస్కర్‌ 773
శ్రీకాకుళం చౌదరి సతీష్‌ 2223 చల్లా వెంకటేశ్వరరావు 1319
రాజాం కంబాల రాజవర్దన 2195 ఎం.చైతన్యకుమార్‌ 924
పాలకొండ హిమరక ప్రసాద్‌ 994 తాడంగి సునీత 1121
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top