డీసీఎం బోల్తా.. ఇద్దరి దుర్మరణం | Confusion driver killed two men | Sakshi
Sakshi News home page

డీసీఎం బోల్తా.. ఇద్దరి దుర్మరణం

Sep 23 2013 12:57 AM | Updated on Aug 30 2018 3:56 PM

న్యూస్‌లైన్ :డ్రైవర్ నిద్రమత్తు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. నల్లగొండ జిల్లా కోదాడ పట్టణంలోని బైపాస్‌రోడ్డుపై శనివారం అర్ధరాత్రి

కోదాడ అర్బన్, న్యూస్‌లైన్ :డ్రైవర్ నిద్రమత్తు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. నల్లగొండ జిల్లా కోదాడ పట్టణంలోని బైపాస్‌రోడ్డుపై శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అనంతపురం జిల్లాకు చెందిన డీసీఎం వాహనం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి హైదరా బాద్‌కు కూరగాయల లోడ్‌తో వెళుతోంది. మార్గం మధ్యలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన పోట్లూరి వెంకటసుబ్బారావు(35), పోట్లూరి నారాయణ (47)లు హైదరాబాద్ వెళ్లేందుకు విజయవాడలో డీసీఎం ఎక్కారు. రాత్రి ఒంటిగంట సమ యంలో డీసీఎం కోదాడ బైపాస్‌రోడ్‌లో గల శ్రీరంగా పురం వద్దకు రాగానే డ్రైవర్ ఒక్క క్షణం రెప్ప వాల్చడంతో ఘోరం జరిగిపోయింది. డీసీఎం అదుపు తప్పి రోడ్డు కిందకు వెళ్లి బొల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో  సుబ్బారావు, నారాయణలు అక్కడిక్కడే మృతి చెంద గా.. డీసీఎం డ్రైవర్, క్లీనర్ గాయాలతో బయటపడ్డారు.  డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్లీనర్‌ను,  మృతదేహాలను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement