అరుణకు అశ్రునివాళి | Condolence to Talari Aruna | Sakshi
Sakshi News home page

అరుణకు అశ్రునివాళి

Dec 24 2013 3:02 AM | Updated on Aug 29 2018 4:16 PM

అరుణకు అశ్రునివాళి - Sakshi

అరుణకు అశ్రునివాళి

విద్యార్థిని అరుణ (21) అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన నల్లగొండజిల్లా కనగల్ మండలం కురంపల్లిలో సోమవా రం జరిగాయి.

అంత్యక్రియలకు భారీగా హాజరైన జనం
 
సాక్షి, నల్లగొండ: విద్యార్థిని అరుణ (21) అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన నల్లగొండజిల్లా కనగల్ మండలం కురంపల్లిలో సోమవా రం జరిగాయి. అంతిమ యాత్రకు ప్రజలు, విద్యార్థులు, పార్టీల నేతలు పెద్దఎత్తున హాజరై వీడ్కోలు పలికారు. ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించగా, ఆరు రోజుల పాటు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరుణ ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా, అరుణ మృతి పట్ల జిల్లాలోని విద్యాసంస్థలు బంద్ పాటించాయి. అరుణ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2.50 లక్షల చెక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య అందజేశారు. అలాగే,  హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో అరుణ కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, దాసరి మల్లేశం పరామర్శించారు. అరుణ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement