సేవ సైనికులు

Common People Helping Poor During Lock down  - Sakshi

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు కరోనా. కరోనా కారణంగా కేవలం ఏ ఒక్క దేశమో, రెండు దేశాలో మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొవడంలేదు. ప్రతి మనిషి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విభృంజించడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో చాలా మంది రోజువారి కార్మికులు, దినసరి కూలీలు, నిరాశ్రయులు, నిరుపేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు స్వచ్చంధ సంస్థలతో పాటు సామాన్యలు సైతం తమ వంతుగా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాము అందించే చిన్న సాయం కొందరి బతుకుల్లో అయిన వెలుగునింపితే చాలని అన్నార్థులకు అండగా నిలుస్తున్నారు. (వెల్లివిరుస్తున్న మానవత్వం)

ముస్లిం మైనారిటీ ట్రస్ట్ ఆధ్వర్యం లో పదమూడు రోజుల నుంచి రామగుండం నియోజకవర్గ పేద ప్రజలకు,వలసకార్మికులకు నిత్య అన్నదానం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని షేక్‌ నసీరుద్దీన్‌, షేక్‌ ఖలీద్‌ పాషా, మహ్మాద్‌ ముస్తఫా దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఈ కష్ట కాలంలో ఎందరో ఆకలి తీరుస్తున్నారు. (లాక్డౌన్ : నలుగురికి స్పూర్తిగా)

హైదరాబాద్‌ అనురాగ్‌ సంస్ధ  ఆధ్వర్యంలో వికలాంగుల కోసం సేకరిస్తున్న విరాళాల కార్యక్రమానకి రామాంజనేయులు, ఆయన కుటుంబం  తమకు తోచిన సాయం అందించి సేవ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.  

విశాఖపట్నానికి చెందిన యారబాటి శ్రీనువాసురావు, (బ్యాంక్ శ్రీను) అల్లిపురం 34 వ వార్డ్‌లో పూట గడవక ఇబ్బంది పడుతున్న పేదలక నిత్యవసర సరుకులు ఉచితంగా అందించి పెద్ద మనసు చాటుకున్నారు.

 

విజయనగరం జిల్లాకు చెందిన మెరుపుల అవతారం కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు తన సొంత డబ్బులు 70 వేలు వెచ్చించి 900 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున వివిధ రకాల కూరగాయలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top