మేలో కృష్ణా త్రిసభ్య కమిటీ భేటీ | Committee on Krishna river water sharing | Sakshi
Sakshi News home page

మేలో కృష్ణా త్రిసభ్య కమిటీ భేటీ

Apr 27 2017 1:45 AM | Updated on Sep 5 2017 9:46 AM

కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే విషయమై మే మొదటి వారంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది.

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే విషయమై మే మొదటి వారంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఇరు రాష్ట్రాలు తమ నీటి అవసరాలను ఇప్పటికే బోర్డు ముందుంచడం, రెండు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. మే, జూన్, జూలై వరకు ప్రస్తుతం ఉన్న నీటి పంపిణీపై కమిటీ ఓ నిర్ణయానికి రానుంది. దీంతో పాటు టెలీమెట్రీ పరికరాలు అమర్చడంపైనా చర్చించనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement