తెలుగు తియ్యదనాన్ని ఆస్వాదిద్దాం | collector B.laxmikantham conducted programme | Sakshi
Sakshi News home page

తెలుగు తియ్యదనాన్ని ఆస్వాదిద్దాం

Feb 10 2014 3:21 AM | Updated on Oct 20 2018 6:17 PM

మనిషికి భాష దేవుడిచ్చిన ఆయుధమని, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగుభాష తియ్యదనాన్ని ఆస్వాదించాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు.

నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్ : మనిషికి భాష దేవుడిచ్చిన ఆయుధమని, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగుభాష తియ్యదనాన్ని ఆస్వాదించాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు. ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో నగరంలోని ట్రంకురోడ్డులోని టీవీఎస్ కల్యాణ సదన్‌లో ఆదివారం ‘తెలుగుభాష-ఔన్నత్యం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ మనసులోని భావాలను మాతృభాషలోనే స్వచ్ఛంగా చెప్పవచ్చన్నారు. మారుతున్న సంస్కృతిలో పరాయి భాషలపై మోజు తగ్గించుకోవాలని సూచించారు. అలల ప్రయాణం తీరం వరకేనని, తెలుగు ప్రయాణం ప్రపంచం ఉన్నంత వరకు అని చెప్పారు. ఇలాంటి సదస్సులను సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు.
   
 గళమెత్తిన కవులు
 సింహపురికి చెందిన కవులు, సాహితీవేత్తలు తెలుగుదనంపై గళమెత్తారు.  కవితాగానాలు సభికులను అలరించాయి. కవులు ఈతకోట సుబ్బారావు, బీవీ నరసింహం, గోవిందరాజుల సుభద్రాదేవి, డాక్టర్ ఈదూరు సుధాకర్, పాతూరి అన్నపూర్ణ, చిన్నినారాయణరావు, బొగ్గవరపు రాధాకృష్ణ తదితరులు తెలుగు భాష విశిష్టత, తెలుగు వెలుగుల గురించి కవితలు వినిపించారు.

 పసిడికాంతుల లక్ష్మీకాంతం
 జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతంను వక్తలు పసిడికాంతుల లక్ష్మీకాంతంగా అభివర్ణించారు. జేసీ బదిలీ కావడంతో వేదికలో ఆయన్ను  ఘనంగా సత్కరించారు.  
 
 స్వాగత సుమాంజలి
 తెలుగుభాష-ఔన్యత్యంపై నిర్వహించిన సదస్సుకు గురుకృప కళాక్షేత్రం అధినేత్రి సురభిగాయత్రి శిష్యబృందం జాహ్నవి, సాయిరిషిత, నిఖితాంజలి, దామినిలు కూచిపూడి నృత్యాలతో స్వాగత సుమాంజలులు పలికారు. అనంతరం ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు చెందిన విద్యార్థినులు శివాని, చందన హైందవి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ తెలుగుతల్లికి నీరాజనం పలికారు. సహస్ర సభాసింహం బీవీ నరసింహం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగిన కార్యక్రమంలో సింహపురికి చెందిన సాహితీవేత్తలు, కవులు, పురప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 కృష్ణదేవరాయల చలువే:
 తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరుస్తున్నాయంటే అది శ్రీకృష్ణదేవరాయుల చలువే.  కృష్ణదేవరాయులు తెలుగు వెలుగులను నింపారు. ప్రస్తుత పాశ్చాత్య సంస్కృతిలో తెలుగు రూపు కోల్పోతోంది. దీన్ని పారదోలాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. బీవీ నరసింహం
 
 పద్యకళను
 కాపాడుకోవాలి:
 పద్యకళను కాపాడుకుంటే తెలుగు భాష ఎక్కడికీ పోదు. ప్రతి సంస్థ భాషపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాతృభాషా దినోత్సవాలు నిర్వహించాలి.  
 ఆలూరి శిరోమణిశర్మ,
 తిక్కన లలిత కళాపీఠం నిర్వాహకుడు
 
 చిత్తశుద్ధితో కృషి చేయాలి:
 తెలుగు మృతభా ష ఎప్పటికీ కాదు. ప్రభుత్వం తెలుగు అమల్లో చిత్తశుద్ధితో కృషి చేయాలి. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలోనూ తెలుగు వాడకానికి పండితులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.    పాతూరి అన్నపూర్ణ
 
 యువత పట్టుసాధించాలి:
 తెలుగుపై పట్టు సాధించాల్సిన బాధ్యత యువతరం పై ఉంది. నేటి యువత రం పరాయి దేశ సంస్కృతి పై మోజు చూపుతోంది. అ వసరమైన చోట ఆంగ్లం వాడవచ్చుకాని, ఆంగ్లమే జీవితంగా మారకూడదు. తెలుగుభాష అమ్మవంటిది.  
  పెరుగు సుజనారామ్
 
 అమ్మలాగే సజీవం:
 అమ్మా,నాన్న ఎం త వాస్తవాలో తె లుగు భాష కూడా అంతే వాస్తవం. పుట్టుక తెలియకున్నా వందల వేల ఏళ్ల నుంచి వస్తున్న భాష ఎప్పటికీ వెలుగొందుతుంది.  
 డాక్టర్ ఈదూరు సుధాకర్
 
 విద్యావ్యవస్థ మారాలి:  
 కొత్తపుంతలు తొ క్కుతున్న నేటి ఆ ధునిక సమాజం లో విద్యావ్యవస్థ లో మార్పులు అవసరం ఉంది. విద్యార్థుల్లో తెలుగుదనం ఉట్టిపడేలా చూసినప్పుడు భాషకు న్యాయం చేసిన వారమవుతాం. డాక్టర్ రామచంద్రుని రమేష్
 
 మాండలీకాలే ఊపిరి:
 పల్లెసీమల్లో మాట్లాడే మాండలికం ఉన్నంత కాలం భాష ఎక్కడికీ పో దు. పల్లెలతో భాష జీవి స్తూనే ఉంటుంది. ఇది అం తులేని ప్రవాహం. ఆధునికత, ప్రపంచీకరణ చుట్టుముట్టినప్పటికీ జానపదులు తరలిపోలేదు. తెలుగు కూడా అంతే. తెలుగు భాష అజరామం.   ఈతకోట సుబ్బారావు
 
 భావితరాలకుఅందించాలి:
 యువతరానికి తెలుగును అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే. తెలుగు సంస్కృ తి, సంప్రదాయాలతో భా ష ముడిపడి ఉంటుంది. అలాంటి సంస్కృతి, సంప్రదాయాలను చిన్నతనం నుంచే పిల్లలకు అలవాటు చేయాలి.   
  గోవిందరాజుల సుభద్రాదేవి
 
 తెలుగు  ప్రాచీనమైంది:
 తెలుగు భాష చాలా ప్రాచీనమైంది. సాహిత్య పరంగా నన్నయ కాలం నుంచి తెలుగు ప్రారంభమైందనుకున్నాం. అయితే అంతకంటే వెయ్యి సంవత్సరాలకు పూర్వమే తెలుగుకు సంబందించిన శాసనాలు లభించాయి. అలాంటి తెలుగును అందరం కాపాడుకోవాలి.      మెట్టు రామచంద్రప్రసాద్
 
 మరో ఉద్యమం రావాలి:  
 దేశం నుంచి ఆంగ్లేయులను తరిమికొట్టేందుకు దాదాపు 200 ఏళ్లు శ్రమిం చాల్సి వచ్చింది. వారు బీజం వేసిన ఆంగ్లభాషను అధిగమించి తెలుగును దేదీప్యమానంగా వెలిగేందుకు మరో ఉద్యమం అవసరం.  జయప్రకాష్
 
 
 మధురమైన భాష :
 తెలుగు భాష ల య, శిల్పం లాంటి శాస్త్ర పరిజ్ఞానంతో నిండిఉంది. భాష తరిగిపోయేది కాదు. త్యాగరాజు కీర్తనల నుంచి అన్నమయ్య పదకోశాల వరకు భాష నిండు ప్రవాహమే.    
 చిన్ని నారాయణరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement