
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం 2020లో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన తన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నాను. రాష్ట్రానికి, ప్రజలకూ ఈ సంవత్సరం అద్భుతమైన ఏడాదిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఐ విష్ ద స్టేట్ అండ్ విష్ ద పీపుల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.