రాజీనామా చేశాకే కిరణ్ మాట్లాడాలి: జీవన్రెడ్డి | CM Kiran kumar Reddy Should Resing: T Jeevan Reddy | Sakshi
Sakshi News home page

రాజీనామా చేశాకే కిరణ్ మాట్లాడాలి: జీవన్రెడ్డి

Aug 9 2013 1:01 PM | Updated on Sep 1 2017 9:45 PM

రాజీనామా చేశాకే కిరణ్ మాట్లాడాలి: జీవన్రెడ్డి

రాజీనామా చేశాకే కిరణ్ మాట్లాడాలి: జీవన్రెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి  నిప్పులు చెరిగారు. కిరణ్‌ సీమాంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కిరణ్.. ఎమ్మెల్యేల ద్వారా సీఎంగా ఎంపికైన నేత కాదని అన్నారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించేలా ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాకే కిరణ్ మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్‌ అధిష్టానం సీఎంను వెంటనే బర్తరఫ్‌ చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రకియపై ముందుకెళ్లాలని సీఎం కిరణ్ నిన్న అన్నారు. రాష్ట్ర విభజన అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీదేనని కేంద్రానికి కాదని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement