మంత్రులకు సీఎం విందు | CM Chandrababu Offers Lunch To Ministers At AP Secretariat | Sakshi
Sakshi News home page

మంత్రులకు సీఎం విందు

May 14 2019 2:44 PM | Updated on May 14 2019 2:50 PM

CM Chandrababu Offers Lunch To Ministers At AP Secretariat - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో మంగళవారం విందు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ సమావేశం అనంతరం మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, సిద్ధా రాఘవరావు, దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, భూమా అఖిలప్రియ, నారాయణ, నిమ్మకాయల చినరాజప్ప, నారాలోకేష్, కొత్తపల్లి జవహర్‌, నక్కా ఆనంద్‌ బాబు, కళా వెంట్రావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు విందులో పాల్గొననున్నారు. ఇక మంత్రులు ఎన్‌ఎండీ ఫరూఖ్‌, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, పితాని సత్యనారాయణ, యనమల రామకృష్ణుడు విందు కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం. కాగా, ఏపీ అసెంబ్లీకి ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. సీఎం ఇచ్చే తాజా విందు చివరిది కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement